Old Man Murders Woman | మహిళను హత్య చేసి.. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికి రెండు రైళ్లలో పడేసిన వృద్ధుడు
Old Man Murders Woman | అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
భోపాల్: అత్యాచారాన్ని అడ్డుకున్న మహిళను వృద్ధుడు హత్య చేశాడు. (Old Man Murders Woman) మృతదేహాన్ని రెండు భాగాలుగా నరికాడు. వాటిని రెండు రైళ్లలో పడేశాడు. దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు చివరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. రత్లాం జిల్లాలోని బిల్‌పాంక్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల మహిళ భర్తతో గొడవ పడింది. జూన్ 6న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె ఉజ్జయిని రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. మథుర వెళ్లేందుకు ఒంటరిగా వేచి ఉన్న ఆ మహిళను 60 ఏళ్ల కమలేష్ పటేల్ గమనించాడు. మాయమాటలు చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. నిద్ర మాత్రలు కలిపిన ఆహారం ఇచ్చాడు. మత్తులో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు.
కాగా, ఆ మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. దీంతో భయపడిన కమలేష్ కత్తితో పొడిచి ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికాడు. మహిళ మృతదేహం భాగాలను బ్యాగుల్లో ఉంచి ఇండోర్-నాగ్డా, ఇండోర్-డెహ్రాడూన్ ప్యాసింజర్ రైళ్లలో వదిలేశాడు.
మరోవైపు జూన్ 10 న ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ చేరిన ఒక రైలులో ఆ మహిళ కాళ్లు, జూన్ 9న ఇండోర్‌కు చేరిన మరో రైలులో మిగతా మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ హత్యపై దర్యాప్తు చేపట్టారు.
కాగా, జూన్ 12న బిల్‌పాంక్ పోలీస్ స్టేషన్లో ఆ మహిళ మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలుసుకున్నారు. ఇంటి నుంచి వెళ్లిన ఆమె కదలికలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ట్రేస్ చేశారు. చివరకు ఉజ్జయినీకి చెందిన నిందితుడు కమలేష్ పటేల్‌ను ఆదివారం అరెస్ట్ చేశారు. మహిళ హత్యకు వినియోగించిన కత్తి, ఇతర ఆధారాలను అతడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

