Israel-Hamas war | ముడిచమురు ధరలు పెరిగితే ముప్పు తప్పదు : పెట్రోలియం మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-హమాస్ వార్ (Israel-Hamas war) నేపధ్యంలో మధ్య ప్రాచ్యంలో నెలకొన్న వివాదాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్-హమాస్ వార్ (Israel-Hamas war) నేపధ్యంలో మధ్య ప్రాచ్యంలో నెలకొన్న వివాదాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 3 డాలర్లు పైగా పెరిగిన క్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
హమాస్ దాడులతో మధ్యప్రాచ్యంలో రాజకీయ అనిశ్చితి కారణంగా చమురు సరఫరాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వివాదం సాగుతున్న ప్రాంతంలో వాణిజ్య ప్రాధాన్యతపై ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ అంతర్జాతీయ ఇంధనానికి ఆ ప్రాంతం సెంట్రల్ హబ్‌గా ఉందని, ఎలాంటి పరిస్ధితులు ఉత్పన్నమైనా భారత్ దీటుగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉందని అన్నారు.
అంతర్జాతీయంగా ఇలాంటి అనిశ్చితి పరిస్ధితులు సురక్షిత ఇంధనాల వినియోగం ప్రాధాన్యతను పెంచుతాయని చెప్పారు. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటితే ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుందని, భారత్ వంటి ముడిచమురు దిగుమతి దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Afghanistan Earthquake | అఫ్గాన్‌లో 2400 దాటిన భూకంప మృతుల సంఖ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

