Delhi | ఢిల్లీకి సన్‌స్ట్రోక్.. మరణ మృదంగం మోగిస్తున్న వేడిగాలులు
నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాదిలో వాతావరణం కొంత చల్లబడినా.. ఉత్తరాదిలో అధిక ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వేడిగాలులు మరణ మృదంగం మోగిస్తున్నాయి.
- హడలెత్తిస్తున్న వడగాడ్పులు
- 24 గంటల్లో 22 మంది మృతి
- నిఘంబోధ్ శ్మశానవాటికలో కొవిడ్ తర్వాత ఇప్పుడే అత్యధిక సంఖ్యలో అంత్యక్రియలు
Delhi | న్యూఢిల్లీ, జూన్ 20: నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాదిలో వాతావరణం కొంత చల్లబడినా.. ఉత్తరాదిలో అధిక ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వేడిగాలులు మరణ మృదంగం మోగిస్తున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల వ్యవధిలో అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బ సంబంధిత అనారోగ్యంతో 22 మంది మరణించారని అధికారులు గురువారం వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా మార్చి 1 నుంచి జూన్ 18 మధ్యలో వడగాల్పుల కారణంగా మొత్తం 114 మంది మరణించారని, 40,984 మంది వడదెబ్బకు గురయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్‌లో అధికంగా 37 మంది మరణించారని, తర్వాతి స్థానాల్లో బీహార్, రాజస్థాన్, ఒడిశా ఉన్నాయని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డాటా పేర్కొన్నది.
నిఘంబోధ్ ఘాట్ కిటకిట
వడగాల్పుల సంబంధిత మరణాలతో ఢిల్లీలోని ప్రధాన శ్మశానవాటిక నిఘంబోధ్ ఘాట్‌లో సామూహిక అంత్యక్రియలు పెరిగాయి. కొవిడ్ తర్వాత ఇక్కడ సామూహిక అంత్యక్రియలు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఆ మరణాలన్నింటికీ వడగాల్పులే కారణమా? అనేదాన్ని మాత్రం అధికారులు నిర్ధారించలేదు. బుధవారం నిఘంబోధ్ ఘాట్‌లో 142 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఇది రోజువారీ జరిగే 50-60 మృతదేహాల కంటే 136 శాతం అధికమని శ్మశానవాటిక నిర్వాహకులు చెబుతున్నారు. కొవిడ్ సమయంలో ఒక్కరోజులో నిఘంబోధ్ 253 శవాలను ఖననం చేయడం జరిగిందని, ఆ తర్వాత ఒక్కరోజులే ఇదే అధికమని అధికారులు చెబుతున్నారు. గురువారం కూడా 97 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.
హజ్ యాత్రలో వెయ్యి మందికి పైగా మృతి
మరోవైపు అధిక ఉష్ణోగ్రతలు సౌదీ అరేబియాను వణికిస్తున్నాయి. వడగాల్పుల కారణంగా ఈ ఏడాది హజ్ యాత్రలో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా యాత్రికులు మరణించారని మీడియా నివేదికలు చెబుతున్నాయి. మక్కాలో 49 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వేలాది మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. మరణించిన వారిలో ఈజిప్టుకు చెందిన 658 మంది, 90 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తున్నది. మృతుల్లో అన్‌రిజిస్టర్డ్ యాత్రికులు సగం కంటే ఎక్కువగా ఉన్నారు. కొంతమంది మిస్సింగ్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తమ వాళ్ల ఆచూకీ కోసం బంధువులు సోషల్ మీడియాల్లో పోస్టులు, ఫొటోలు పెడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

