Jagannath Puri Ratna Bhandar | జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారంలో మరో రహస్య గది?
Jagannath Puri Ratna Bhandar | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవిల మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేశారు.
Jagannath Puri Ratna Bhandar | భువనేశ్వర్: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారం తాళం చెవిల మిస్సింగ్ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నది. తాళాల అదృశ్యం వెనుక ఏదో జరిగిందంటూ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ్ మహాపాత్ర అనుమానాలు వ్యక్తం చేశారు. తాళాల మిస్సింగ్, తర్వాత డూప్లికేట్ తాళాలను గుర్తించినట్టు చెప్పడంపై ఇప్పటికే గందరగోళం నెలకొన్న నేపథ్యంతో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
రత్న భాండాగారం తాళాలు కనిపించకుండా పోవడం, డూప్లికేట్ తాళాలు తెరపైకి రావడం సిగ్గుచేటని మహాపాత్ర అన్నారు. ఈ డూప్లికేట్ తాళాల చెవులు రత్న భాండాగారం ఇన్నర్ చాంబర్లోని తాళాలకు సరిపోలేదని పేర్కొన్నారు. ‘దీన్నిబట్టి చూస్తే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. నిజం బయటకు రావాలంటే దర్యాప్తు జరగాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. విలువైన వస్తువులు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని భాండాగారం పెట్టెలు తెరిచాకే నిర్ధారించగలమన్నారు. డూప్లికేట్ తాళం చెవులు ఇన్నర్ చాంబర్ తాళాలను తెరువలేకపోవడంపై దర్యాప్తు చేస్తామని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది.
భాండాగారంలో మరో రహస్య గది?
రత్న భాండాగారం కింద రహస్య గది ఉన్నదని, సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఆ గదిలో విలువైన సంపద దాచారని కొందరు చరిత్రకారులు చెప్పారు. 1902లో ఆంగ్లేయుల పాలనలో ఈ సొరంగ మార్గం అన్వేషణకు విఫల ప్రయత్నాలు జరిగాయన్నారు. ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మాట్లాడుతూ పూరీ రాజు కపిలేంద్ర దేవ్, తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలలో పెద్దయెత్తున సంపద సమకూరిందని, దాన్ని భద్రపరిచేందుకు సొరంగ మార్గం నిర్మించారన్నారు. ఇందులో 34 కిరీటాలు, రత్న ఖచిత స్వర్ణ సింహాసనాలు, దేవతల బంగారు విగ్రహాలు ఉన్నాయని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

