Free Tea | లారీ డ్రైవర్లకు ఫ్రీ ఛాయ్.. ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం
Free Tea | చాలావరకు రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణం అవుతుంటాయి! సరకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతున్నప్పుడు.. ఒక్కసారి రెప్పవాల్చినా సరే.. ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి.
Free Tea | చాలావరకు రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణం అవుతుంటాయి! సరకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతున్నప్పుడు.. ఒక్కసారి రెప్పవాల్చినా సరే.. ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిద్రలేమి, అలసిపోయి ఉన్న లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ పంపిణీ చేయడం ద్వారా వారిలో నిద్రమత్తు వదిలించి ఉత్తేజ పరచాలని నిర్ణయించింది.
హైవేల పక్కన ఉన్న దాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఉచితంగా టీ అందించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది. ఈ పథకం అమలులో భాగంగా తొలుత రోజూ రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఫ్రీ ఛాయ్ ఇవ్వనున్నట్లు చెప్పింది. ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. లారీ డ్రైవర్లు టీ తాగిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకునేలా కూడా హైవేల పక్కన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. 30 జిల్లాల్లో లారీ టెర్మినల్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వాటిలో నిద్రపోవడానికి, స్నానాలు చేయడానికి సౌకర్యాలు ఉంటాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

