Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Odisha Athletes : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువ అథ్లెట్లు మరణించారు. మృతులను మృత్యం దొండపాటి, మలయ్ బారిక్గా గుర్తించారు.
Odisha Athletes : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువ అథ్లెట్లు మరణించారు. మృతులను మృత్యం దొండపాటి, మలయ్ బారిక్గా గుర్తించారు. ఒడిశాలోని కటక్ హైవేపై బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మృత్యం, మలయ్ ఒక బైకుపై వెళ్లగా.. వారి వెనుక మరో బైకుపై ఇంకో క్రీడాకారుడు, స్విమ్మింగ్ కోచ్ ఉన్నారు.
ఈ క్రమంలో మృత్యం, మలయ్ ప్రయాణిస్తున్న బైకు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పాయరు. అయితే, రోడ్డు ప్రమాదం కచ్చితంగా ఎలా జరిగింది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువ అథ్లెట్లు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఒడిశా క్రీడారంగానికి వారి మృతి తీరని లోటు అన్నారు. మృత్యం, మలయ్ కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
మృతుల్లో మృత్యం దొండపాటి ఇండియాలో అండర్-23లో స్ప్రింటింగ్ ర్యాంక్స్లో కొనసాగుతున్నాడు. 2025లో ఫాస్టెస్ట్ అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్నాడు. మలయ్ కూడా 400 మీటర్ల స్పింట్లో సత్తా చాటాడు. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ క్రీడాకారులు ఇలా మరణించడంపై క్రీడాకారులతోపాటు ప్రజలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

