Rehana Fathima: నగ్నత్వం, అశ్లీలత ఒక్కటి కాదు.. ఫాతిమాపై కేసు కొట్టివేత
Rehana Fathima: ఫాతిమాపై దాఖలైన పోక్సో కేసును కేరళ కోర్టు కొట్టిపారేసింది. నగ్నత్వం, అశ్లీలత అన్ని సందర్భాల్లో ఒక్కటి కాదు అని కోర్టు తెలిపింది. తన శరీరంపై పిల్లలతో పేయింటింగ్ వేయించిన కేసులో హక్కుల నేత ఫాతిమా కోర్టు కేసు ఎదుర్కొంటోంది.
కొచ్చి: మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా(Rehana Fathima)పై నమోదు అయిన పోక్సో కేసును కేరళ హై కోర్టు కొట్టిపారేసింది. మహిళ నగ్న శరీరంపై బొమ్మలు వేయడాన్ని అన్ని సందర్భాల్లో అశ్లీలంగా, లైంగికమైందిగా భావించరాదు అని కోర్టు తెలిపింది. తమ శరీరంపై మహిళలకు ఉన్న స్వేచ్ఛా హక్కును విభేదించలేమని కోర్టు తెలిపింది. పోక్సోతో పాటు జువెనైల్ జస్టిస్, ఐటీ చట్టాల కింద ఫాతిమాపై గతంలో ఓ కేసు నమోదు అయ్యింది. అర్ధనగ్నంగా ఉన్న ఆమె తన పిల్లలతో శరీరంపై పేయింటింగ్ వేయించుకున్నది. అయితే ఆ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. దానిపై నమోదు అయిన కేసులో కేరళ కోర్టు తీర్పునిచ్చింది.
ఈ కేసులో జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తీర్పుని ఇస్తూ .. 33 ఏళ్ల సామాజిక కార్యకర్త ఫాతిమా తన లైంగిక తృప్తిని తీర్చుకునేందుకు తన పిల్లలను వాడుకున్నట్లు నిర్ధారించలేమని అన్నారు. తన శరీరాన్ని కేవలం కాన్వాస్ తరహాలో వాడుకునేందుకు తన పిల్లలకు అవకాశం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తన శరీరాన్ని తనకు నచ్చినట్టు వాడుకునే స్వేచ్ఛ మహిళకు ఉందని, అది ప్రాథమిక సమానత్వ హక్కు అవుతుందని, తన ప్రైవసీకి సంబంధించిన అంశమని కోర్టు చెప్పింది. శరీర స్వేచ్ఛ అనేక రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కిందకు వస్తుందని కోర్టు తెలిపింది.
పేయింటింగ్ కోసం తన శరీర పైభాగాన్ని ఫాతిమా తన వీడియోలో చూపించిందని, ఇది అశ్లీలం అవుతుందని ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదించింది. ఆ వాదనను జడ్జి కొట్టేశారు. నగ్నత్వం, అశ్లీలం ఎప్పుడూ ఒక్కటి కాదు అని, నగ్నత్వాన్ని అశ్లీలంగా భావించడం సరికాదు అని అన్నారు. దాన్ని అసభ్యంగా, అనైతికంగా చూడరాదు అని కోర్టు తెలిపింది. ఒకప్పుడు కేరళకు చెందిన దిగువ జాతి స్త్రీలు తమ యదలపై వస్త్రాన్ని కప్పుకునేందుకు పోరాటం చేయాల్సి వచ్చిందని, ఎన్నో ఆలయాల్లో సెమీ న్యూడ్ విగ్రహాలను మనం చూడవచ్చు అని, అలాంటి ప్రదేశాలను మనం పవిత్రమైనవిగా భావిస్తున్నామని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

