అగ్నివీరుల భవిష్యత్ భద్రం : జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్
అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భరోసా ఇచ్చారు.
న్యూఢిల్లీ : అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భరోసా ఇచ్చారు. రెగ్యులర్ సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు.
అగ్నివీరుల భవిష్యత్ పూర్తిగా భద్రమేనని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ స్కీంను సమర్ధించిన అజిత్ దోవల్ యువ, సుశిక్షిత సేనలు సైన్యానికి అవసరమని అన్నారు. రెజిమెంటల్ వ్యవస్ధ యధావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న హింసాత్మక నిరసనలపై అజిత్ దోవల్ ఆందోళన వ్యక్తం చేశారు.
విధ్వంసం, హింసాకాండను ఎట్టిపరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అగ్నిపథ్ నిరసనల వెనుక కొందరి స్వార్ధ ప్రయోజనాలు దాగున్నాయని, సమాజంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే కొందరు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. హింసాకాండను ఎవరూ సమర్ధించుకోలేరని అన్నారు. అగ్నిపథ్ నిరసనలపై స్పందిస్తూ హింసాత్మక నిరసనల విషయంలో నిందితులను గుర్తించారని, విచారణ జరుగుతుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Agniveer
- ajit doval
- NSA
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

