లక్నో, డిసెంబర్ 25: ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సీఎం యోగికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో అభ్యంతరకర వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిని యూపీలోని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. నోయిడాలోని సెక్టార్-51కు చెందిన రామ్పాట్ యాదవ్‌ను గౌతమ్‌బుద్ధ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై వివిధ సెక్షన్ల కేసు నమోదైంది.