మహిళపై చేయి చేసుకున్న బీజేపీ యువ నాయకుడు.. వీడియో
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీకాంత్ త్యాగి ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. మొక్కలను టచ్ చేసి చూడు.. నీ అంతు చూస్తా అని బెదిరింపులకు గురి చేశాడు. అంతే కాదు ఆమెపై చేయి చేసుకుని తన పురుష అహంకారాన్ని ప్రదర్శించాడు. మహిళను బెదిరించిన శ్రీకాంత్ త్యాగిపై పలువురు మహిళలు మండిపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ త్యాగి నోయిడాలోని సెక్టార్ 93బీ లోని గ్రాండ్ ఓమాక్సే లో నివాసం ఉంటున్నాడు. అయితే మూడేండ్ల క్రితం సొసైటీకి చెందిన కామన్ ఏరియాతో పాటు పాటు పార్క్‌ను ఆక్రమించుకున్నాడు. దీంతో 2019 నుంచి సొసైటీ సభ్యులకు, శ్రీకాంత్ త్యాగికి గొడవలు ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం పార్క్ ఏరియాలో మొక్కలు నాటేందుకు శ్రీకాంత్ వచ్చాడు. అతన్ని సొసైటీకి చెందిన ఓ మహిళ అడ్డుకున్నారు. దీంతో ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన త్యాగి.. చేయితో నెట్టేశాడు.
ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. తనతో పాటు తన భర్త, పిల్లలను త్యాగి బెదిరింపులకు గురి చేశాడని, అసభ్యకర పదజాలంతో దూషించాడని పేర్కొన్నది. మొక్కలను టచ్ చేస్తే నీ అంతు చూస్తానని బెదిరించాడని వాపోయింది. మహిళపై చేయి చేసుకున్న త్యాగిని కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Longer version of the video where BJP leader Shrikant Tyagi is seen abusing a woman.
Warning : **Abusive language** pic.twitter.com/1ahGdEjIUq— Mohammed Zubair (@zoo_bear) August 5, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

