Biren Singh | నేను రాజీనామా చేసే ప్రశ్నే లేదు : మణిపూర్ సీఎం బీరెన్ సింగ్
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం కూడా జరుగుతోంది. కాగా, ఈ పరిణామాలపై బీరెన్ సింగ్ స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలలుగా ఆ రాష్ట్రంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. రోజురోజుకూ అక్కడ పరిస్థితులు దిగజారి పోతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటీవలే అక్కడ ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటన కూడా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సందర్భంలో బీరెన్ ను బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం కూడా జరుగుతోంది. కాగా, ఈ పరిణామాలపై బీరెన్ సింగ్ స్పందించారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే ప్రశ్నే లేదు. కానీ, కేంద్ర నాయకత్వం, మణిపూర్ ప్రజలు కోరుకుంటే నేను పదవిని వదిలేస్తాను’ అని ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
‘నేను ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కార్యకర్తను. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఇప్పటి వరకూ ఎవరూ నన్ను రాజీనామా చేయమని అడగలేదు. కేంద్ర నాయకత్వం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను. ప్రస్తుతం నా ప్రధాన లక్ష్యం మణిపూర్ లో వీలైనంత త్వరగా శాంతి భద్రతలు, శాంతిని పునరుద్ధరించడమే’ అని బీరెన్ వెల్లడించారు.
Also Read..
Yuvraj Singh | యువరాజ్ సింగ్ ఫ్యామిలీకి బెదిరింపులు.. మహిళ అరెస్ట్
Heavy Rains | వడగళ్ల వర్షంతో విమానానికి రంధ్రం.. అత్యవసర ల్యాండింగ్
Biden Pet Commander | రక్షణ సిబ్బందిని మూడు నెలల్లోనే పది సార్లు కరిచిన బైడెన్ పెంపుడు శునకం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

