Uttar Pradesh Assembly | బిగ్గరగా నవ్వరాదు, పత్రాలు చించవద్దు, ఫోన్లు తీసుకురాకూడదు.. యూపీ అసెంబ్లీలో కొత్త నిబంధనలు
Uttar Pradesh Assembly | సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు. స్పీకర్‌కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయరాదు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో (Uttar Pradesh Assembly ఈ మేరకు పలు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
లక్నో: సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్ ఫోన్లు తీసుకురావద్దు. స్పీకర్‌కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయరాదు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో (Uttar Pradesh Assembly ఈ మేరకు పలు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బుధవారం చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా తెలిపారు.
కాగా, కొత్త నిబంధనల ప్రకారం, శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపైనా చూడటం లేదా ప్రశంసించడం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేదా వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్‌కు వీపు చూపకూడదు. అలాగే సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతాగరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు.
మరోవైపు కొత్త నిబంధనల ప్రకారం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల వ్యవధిని ప్రస్తుతం ఉన్న 14 రోజుల నుంచి ఏడు రోజులకు అంటే సగానికి తగ్గించనున్నారు. అలాగే సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురాకూడదు. ప్రొసీడింగ్‌లకు సంబంధించిన స్లిప్పులను పంపిణీ చేయడానికి అనుమతించరు. అలాగే ఎమ్మెల్యేలకు రోజువారీ విధులను శాసనసభ ప్రధాన కార్యదర్శి ద్వారా ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో కేటాయిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

