5 నగరాల్లో లాక్డౌన్.. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఉదృతిని తగ్గించేందుకు అయిదు నగరాల్లో లాక్డౌన్ విధించాలని ఉత్తరప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్, గోరఖ్‌పూర్‌లలో ఏప్రిల్ 28వ తేదీ వరకు లాక్డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు నిన్న తన ఆదేశాలు పేర్కొన్నది. ప్రజల కదలికలపై ఆంక్షలు విధిస్తేనే, వైరస్ వ్యాప్తిని నియంత్రించే అవకాశం ఉన్నట్లు ఆ తీర్పులో హైకోర్టు పేర్కొన్నది. అయితే అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ యూపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన సుప్రీం.. అలహాబాద్ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది.
చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు జస్టిస్ ఏఎస్ బొప్పన్న, వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం యూపీ ప్రభుత్వం అప్పీల్‌ను విచారించింది. అయితే మహమ్మారి నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను హైకోర్టుకు విన్నవించాలని సుప్రీం ధర్మాసనం యూపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు సీనియర్ అడ్వకేట్‌గా పీఎస్ నరసింహను అమికస్ క్యూరీగా నియమించారు. న్యాయపరమైన ఆదేశాల ద్వారా లాక్డౌన్ విధించడం సరైన విధానం కాదు అని యూపీ ప్రభుత్వం తన అఫిడవిట్లో సుప్రీంకు చెప్పింది. 5 నగరాల్లో లాక్డౌన్ అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్రంలో తీవ్ర పరిపాలనా సమస్యలను సృష్టిస్తాయని యూపీ ప్రభుత్వం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

