జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు

న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ తన అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడదని, హుందాగా కనిపించే ఫార్మల్ డ్రెస్సులే వేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాల ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. ప్రతి రోజూ నీట్‌గా షేవ్ చేసుకోవాల్సిందే. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకోవాలి.
ఆఫీస్‌లో జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్, చెప్పులు, క్యాజువల్ వేర్ ఏదీ అనుమతించబోము అని ఆ ఆదేశాల్లో డైరెక్టర్ సుబోధ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల హెడ్స్ కచ్చితంగా ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని కూడా అందులో తేల్చి చెప్పారు. నిజానికి ఎప్పటి నుంచో ఇలాంటి డ్రెస్సింగ్ సీబీఐలో ఉన్నా.. గత కొన్నేళ్లుగా కొందరు క్యాజువల్స్ వేసుకోవడం ప్రారంభించారని, అయితే ఇన్ని రోజులూ వారిని ఎవరూ ప్రశ్నించలేదని ఓ సీబీఐ అధికారి అన్నారు. ఈ ఆదేశాలు ఒకరకంగా మంచివేనని అభిప్రాయపడ్డారు. గత వారమే సీబీఐ 33వ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుబోధ్.. రానున్న రోజుల్లో సీబీఐ పనితీరును మెరుగుపరిచేందుకు కొన్ని కీలక చర్యలు తీసుకోనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

