Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Anant Singh | బీహార్‌లోని అధికార కూటమికి చెందిన జేడీ(యూ) నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ దీనిని చాలా తేలికగా తీసుకున్నారు. ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఇక ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన అన్నారు.
పాట్నా: బీహార్‌లోని అధికార కూటమికి చెందిన జేడీ(యూ) నుంచి బహిష్కరణకు గురైన ఆ పార్టీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ దీనిని చాలా తేలికగా తీసుకున్నారు. ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’ అని వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి ఇక ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదని ఆయన అన్నారు. (Anant Singh) బీహార్ శాసనమండలి ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే అనంత్ సింగ్, ఆయన భార్యను జేడీ(యూ) నుంచి ఆరేళ్ల పాటు శనివారం బహిష్కరించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. జేడీ(యూ) చర్య పట్ల తనకు ఎలాంటి విచారం లేదని తెలిపారు. ‘నితీశ్ కుమార్ అక్కడ లేరు. ఆ పార్టీ ఆయనదే, ఆయన వెళ్లిపోవడంతో ఆ పార్టీ కూడా ముగిసిపోయింది. కనీసం 10 స్థానాల్లో జేడీ(యూ) ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ చర్యకు ఎవరు ఆదేశాలిచ్చారో నాకు తెలియదు. బహుశా పార్టీని తమ ఆధీనంలోకి తీసుకున్న వారే దీనికి కారణమై ఉండవచ్చు’ అంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు.
కాగా, తన భవిష్యత్తు రాజకీయం గురించి అనంత్ సింగ్ క్లారిటీ ఇచ్చారు. సొంత పార్టీని ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. ‘నితీశ్ కుమార్‌తో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నేను ఆయనను మళ్లీ కలుస్తా. నేను ఏ పార్టీలోకి వెళ్లినా, నితీశ్జీని ఎప్పటికీ విమర్శించను’ అని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Anant Singh
- Expulsion
- Gone
- JDU
RELATED ARTICLES
తాజా వార్తలు
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

