అధికారాన్ని ఎలా ఉపయోగించవచ్చో గడ్కరీ చూపారు: శరద్ పవార్

ముంబై: కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెగ పొగిడారు. అధికారాన్ని ఎలా ఉపయోగించవచ్చో అన్నది ఆయన చూపించారని ప్రశంసించారు. మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ మధ్య వైరం ఉన్నప్పటికీ, అహ్మద్ నగర్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో నితిన్ గడ్కరీ, శరద్ పవార్ ఒకే వేదికను పంచుకున్నారు. ‘నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఎందుకంటే, అహ్మద్‌నగర్‌లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే అనేక ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించబోతున్నట్లు నాకు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గోవాలని ఆయన కోరారు’ అని శరద్ పవార్ అన్నారు.
సాధారణంగా ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన అనంతరం చాలా కాలం వరకు పనులు మొదలుకావని, అయితే నితిన్ గడ్కరీ ప్రాజెక్టు పనులు కొన్ని రోజుల్లోనే మొదలుకావడంతోపాటు అనుకున్న సమయంలోపు పూర్తవుతాయని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం ఎలా పని చేయాలో అన్నదానికి ప్రజాప్రతినిధి అయిన గడ్కరీ నిదర్శనమని కొనియాడారు. రోడ్డు రవాణా శాఖను గడ్కరీ చేపట్టక ముందు ఐదు వేల కిలోమీటర్ల రహదారుల్లో పనులు జరుగ్గా, ఆయన హయాంలో ఈ సంఖ్య 12,000 కిలోమీటర్లు దాటిందన్నారు.
కాగా, అహ్మద్‌నగర్ జిల్లాలో నీటి సంరక్షణపై దృష్టి సారించాలని వేదికపైనున్న ఎన్సీపీకి చెందిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ప్రవాహాలు, చెరువుల లోతును పెంచడం వల్ల భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు దోహదపడుతుందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

