కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ : రూ . 10 కోట్లు డిమాండ్ చేసిన కాలర్
మహారాష్ట్రలోని నాగపూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ముంబై : మహారాష్ట్రలోని నాగపూర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఖమ్లా ప్రాంతంలోని గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయ ల్యాండ్‌లైన్ నెంబర్‌కు అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కాగా ఈ ఏడాది జనవరిలో నితిన్ గడ్కరీ నివాసానికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెబుతూ రూ. 100 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గడ్కరీ పీఆర్ కార్యాలయానికి జనవరి 14న మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు మంత్రి నివాసంతో పాటు కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాలర్‌ను జయేష్ పూజారిగా గుర్తించారు. తన డిమాండ్ నెరవేర్చకుంటే బాంబుతో మంత్రికి హాని తలపెడతానని అతడు బెదిరించాడు. జయేష్ పూజారి హిందల్గ జైలు ఖైదీ అని, గతంలో ఓ హత్య కేసులో కోర్టు అతడికి మరణ శిక్ష విధించిందని దర్యాప్తులో వెల్లడైంది. మరోవైపు గడ్కరీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కామెంట్స్ పెడుతున్న వ్యక్తిపై నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More :
Amritpal Singh | మారువేషాల్లో తప్పించుకు తిరుగుతున్న అమృత్‌పాల్.. ఫొటోలు విడుదల చేసిన పంజాబ్ పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana | తెలంగాణలో కొత్త రాజకీయం.. 27కు పెరుగనున్న మంత్రులు.. మహిళలకు 9లోక్‌సభ, 60 అసెంబ్లీ సీట్లు
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు.. ప్రస్తుత ప్రభుత్వాన్నే కొనసాగిస్తారా? లేక.. రాష్ట్రపతి పాలన విధిస్తారా??
Delimitation | తెలంగాణకు 26 లోక్‌సభ సీట్లు.. పునర్విభజన తర్వాత పెరిగే లోక్‌సభ స్థానాల పటాన్ని విడుదల చేసిన కేంద్రం!
Delimitation | ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. డీలిమిటేషన్‌పై బీజేపీ, కాంగ్రెస్ సొంత వ్యూహాలు?
Deeksha Divas | ఉద్యమానికి ఊపిరిలూదిన దీక్షా దివస్.. నేడు కరీంనగర్ గడ్డపై స్ఫూర్తి సభ
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

