Nita Ambani: నీతా అంబానీ గ్రాండ్ గెటప్స్ చూశారా ?
Nita Ambani:గోల్డ్ చీర కట్టినా.. ఎమరాల్డ్ నక్లెస్ పెట్టినా.. నీతా అంబానీ రేంజే వేరు. చాలా సింపుల్.. చాలా గ్రాండ్.. చాలా స్టయిలిష్ ఆమె లుక్స్. ఇటీవల కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం వేళ.. నీతా తన డ్రెస్సింగ్ సెన్స్‌తో సూపర్ రిచ్‌గా కనిపించారు.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి సతీమణి నీతా అంబానీ(Nita Ambani) ఆ రేంజ్‌కు తగ్గట్లే ఉంటుంది. ఎక్కడా ఆమె వైభవం తగ్గదు. రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ ఆమె. ఇటీవల నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను ముంబైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్ సమయంలో నీతా అంబానీ.. తన హుందాతనంతో ఆకట్టుకున్నారు. ఆ ప్రత్యేక కార్యక్రమం కోసం ఆమె కలర్ఫుల్గా కనిపించారు. బాలీవుడ్ సెలబ్రటీలకు తీసిపోని రీతిలో తన ఆకర్షణీయ లుక్‌ను ఆమె ప్రజెంట్ చేశారు. ఈవెంట్ మొదటి రోజు ఆమె తన స్టయిల్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. బ్లూ కలర్ గోల్డెన్ సిల్క్ శారీలో ఆమె తళుక్కుమన్నారు. అదే స్టయిల్లో బ్లౌజ్ కూడా వేసుకుందామె. ఇక ఆమె మెడ మరో మణిహారంగా మారింది. గోల్డ్, ఎమరాల్డ్ నెక్లెస్‌తో నీతా ధగధగ మెరిసిపోయింది. మ్యాజింగ్ చెవి పోగులు, బ్రెస్‌లెట్స్ వేసుకుంది. కల్చరల్ సెంటర్ ఈవెంట్ కోసం నీతా డెకరేట్ అయిన తీరు పర్ఫెక్ట్గా ఉంది. మెరూన్ రంగు బొట్టుతోనూ ఆమె మెస్మరైజింగ్ లుక్ ఇచ్చారు.
కేవలం సాంప్రదాయ లుక్‌లోనే కాదు.. తనలోని ఫ్యాషన్ ట్యాలెంట్‌ను కూడా నీతా ప్రదర్శించారు. కల్చరల్ సెంటర్ ప్రారంభం సందర్భంగా రెండవ రోజు.. ధగధగలాడే గోల్డెన్ కలర్ వాలెంటినో గౌన్ వేసుకున్నారు. డిజైనర్ అబూ జానీ సందీప్ కోష్లా .. ఎంబ్రాయిడరీ చేసిన లేస్‌ను వాడారు. ఆ ఫ్యాషన్ గౌన్‌కు తోడు ఆమె ముత్యాల, డైమెండ్ నెక్లెస్ వేసుకున్నారు. ఇక మేకప్ కూడా సెలబ్రిటీ రేంజ్లో ఉంది. కనులు, కనుబొమ్మలు, పెదవులు.. ముఖ సౌందర్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
గెటప్‌లోనే కాదు.. తన డ్యాన్సింగ్ స్కిల్స్‌ను కూడా నీతా ప్రదర్శించారు. రఘపతి రాఘవ రాజారాం పాటకు ఆమె డ్యాన్స్ చేశారు. సాంప్రదాయ నృత్య కళను ఆమె ప్రదర్శించారు. ఆ డ్యాన్స్‌కు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎరుపు రంగు లెహంగాలో ఆమె ఓ నాట్యకారిణిని మరిపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

