కోజికోడ్: కేరళలో మరొకరికి నిపా వైరస్ సోకింది. 24 ఏండ్ల హెల్త్ వర్కర్ వైరస్ బారిన పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటికే వైరస్ సోకి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉన్న 9 ఏండ్ల బాలుడిని కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నారు. మరోవైపు, వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కోజికోడ్‌లో ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. స్కూళ్లు, బ్యాంకులు మూసివేశారు. తాజాగా వెలుగుచూసిన నిపా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్‌కు చెందినదని అధికారులు వెల్లడించారు. దీనికి మరణ రేటు అధికంగా ఉన్నట్టు తెలిపారు.