Nipah Virus: కేరళలో నిఫా.. మృతిచెందిన బాలుడి కాంటాక్ట్ లిస్టులో 350 మంది
Nipah Virus: కేరళలో నిఫా వైరస్ సోకి 14 ఏళ్ల పిల్లోడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కుర్రాడితో కాంటాక్టులోకి వచ్చి రిస్క్‌లో ఉన్న వారి జాబితాను తయారు చేస్తున్నారు. ఆ లిస్టులో 350 మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.
కోజికోడ్: కేరళలో నిఫా వైరస్(Nipah Virus) సోకి 14 ఏళ్ల పిల్లోడు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ కుర్రాడితో కాంటాక్టులోకి వచ్చి రిస్క్‌లో ఉన్న వారి జాబితాను తయారు చేస్తున్నారు. ఆ లిస్టులో 350 మంది ఉన్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. దాంట్లో 101 మంది హై రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 13 మంది టెస్ట్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. కోజికోడ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు వాళ్ల శాంపిళ్లను పంపారు. ల్యాబ్‌కు శ్యాంపిళ్లు పంపినవారిలో.. ఆరుగురికి నిఫా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మృతిచెందిన పిల్లోడి పేరెంట్స్ మాత్రం ఎటువంటి లక్షణాలులేవు. అయినా వాళ్ల శ్యాంపిళ్లను మరోసారి టెస్టింగ్‌కు పంపినట్లు మంత్రి చెప్పారు.
పాలక్కాడ్, తిరునవంతపురం నుంచి కాంటాక్టులో వచ్చినవారు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. మరణించిన పిల్లవాడు పాండిక్కడ పంచాయతీలో ఉన్న ఓ ప్రాపర్టీ నుంచి ఫలాన్ని తిన్నట్లు అతని మిత్రులు తెలిపారు.ఆ ప్రాంతంలో గబ్బిలాలు ఉన్నట్లు గుర్తించారు. మలప్పురంకు చెందిన 14 ఏళ్ల పిల్లోడు .. నిఫా ఇన్ఫెక్షన్తో ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. కుర్రాడి మిత్రులకు ఆన్లైన్లో క్లాసులు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 224 ఫీవర్ సర్వియలెన్స్ బృందాలు పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
విద్యార్థుల అభ్యసన స్థాయి పరిశీలన
Dad’s Little Friend | ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌తో ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ : నిర్మాత దీపక్
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

