న్యూఢిల్లీ: పొగాకు వల్ల ఆరోగ్యానికి కలిగే చేటును తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్ ప్రయోగశాలలో అభివృద్ధిపరచిన పొగాకు మొక్కలో నికొటిన్ దాదాపు 40-50 శాతం తక్కువగా ఉందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ ఎన్ కలైసెల్వి సోమవారం చెప్పారు.
ఈ పొగాకును వాడేవారి ఆరోగ్యానికి ముప్పు ఉండదన్నారు. నికొటిన్ను 60-70 శాతం వరకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.