Gurpatwant Singh Pannun | ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఆస్తులు జప్తు
Gurpatwant Singh Pannun | ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జప్తు చేసింది. పంజాబ్‌లోని చండీగఢ్, అమృత్‌సర్‌లో ఆయనకు చెందిన ఆస్తుల వద్ద జప్తు నోటీసులు ఉంచింది.
చండీగఢ్: ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun)కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జప్తు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద పంజాబ్‌లోని చండీగఢ్, అమృత్‌సర్‌లో ఆయనకు చెందిన ఆస్తుల వద్ద జప్తు నోటీసులు ఉంచింది. చండీగఢ్‌లోని నివాసంతోపాటు అమృత్‌సర్‌లోని పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో గురుపత్వంత్ సింగ్‌కు చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్ఐఏ జప్తు చేసింది. పన్నూన్ తండ్రి మొహిందర్ సింగ్ గతంలో తరన్ తరణ్‌లోని పట్టి సబ్ డివిజన్లోని నాథూ చక్ గ్రామంలో నివసించాడు. దేశ విభజన తర్వాత అమృత్‌సర్‌లోని ఖాన్కోట్ గ్రామానికి ఆ కుటుంబం మారింది.
కాగా, గురుపత్వంత్ సింగ్ పన్నూన్, సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్ కోసం వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడంతోపాటు పంజాబ్‌లోని సిక్కు యువకులను మిలిటెన్సీలో చేరడానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2020 జూలైలో గురుపత్వంత్ సింగ్‌ను ఉగ్రవాదిగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ గుర్తించింది. రెండు నెలల తర్వాత కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 51ఏ కింద ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

