ఈ ఏడాది 73 కేసులు నమోదు చేసిన ఎన్ఐఏ
NIA | నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022 సంవత్సరంలో గరిష్ఠంగా 73 కేసులను నమోదు చేసింది. గతేడాది కంటే (2021) 19.67శాతం కేసులు ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్ఐఏను ప్రారంభించి తర్వాత
న్యూఢిల్లీ : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) 2022 సంవత్సరంలో గరిష్ఠంగా 73 కేసులను నమోదు చేసింది. గతేడాది కంటే (2021) 19.67శాతం కేసులు ఎక్కువ. ముంబై 26/11 ఉగ్రదాడి అనంతరం ఎన్ఐఏను ప్రారంభించి తర్వాత ఇంత మొత్తంలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. వీటిలో జిహాదీ ఉగ్రవాదానికి సంబంధించినవి 35 కేసులుండగా.. జమ్మూకశ్మీర్, అసోం, బీహార్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌లలో జిహాదీ ఉగ్రవాద కేసులను ఎన్ఐఏ నమోదు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ అనేక కేసులను విచారిస్తోంది. ఈ సంవత్సరం ఎన్ఐఏ చేపట్టిన అతిపెద్ద కార్యకలాపాల్లో ఒకటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై దాడులు జరిపింది.
సెప్టెంబరు నుంచి నిర్వహించిన మూడు వేర్వేరు దాడుల్లో ఎన్ఐఏ దాదాపు 200 చోట్ల దాడులు జరిపింది. పీఎఫ్ఐకి చెందిన 100 మంది వ్యక్తులను అరెస్టు చేసింది. ముంబై 26/11 దాడుల తర్వాత 2009లో ఎన్ఐఏ ఏర్పాటైంది. 2019లో ప్రభుత్వం చట్టవ్యతిరేక నిరోధక (కార్యకలాపాలు) చట్టంలోని షెడ్యూల్ 6ను సవరించింది. ఈ సవరణతో ఎన్ఐఏ ఓ వ్యక్తికి ఉగ్రవాదిగా గుర్తించే అవకాశం ఉండగా.. ఇంతకు ముందు సంస్థలను మాత్రమే ఉగ్రవాద సంస్థలుగా పేర్కొనే అవకాశం ఉంది. ఆగస్ట్ 2022 నాటికి ఎన్ఐఏ నేరారోపణ రేటు 93.25 శాతంగా ఉంది. ఏ కేంద్ర ఏజెన్సీకి అయినా ఇదే అత్యధికం. ఏజెన్సీలో దాదాపు 3వేల మంది వ్యక్తులను అరెస్టు చేయగా.. ఆగస్టు 2022 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. 391 మంది దోషులుగా తేలారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Jihadi terrorism
- NIA
- PFI
- Telug News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

