ISIS terrorists | దేశవ్యాప్తంగా పేలుళ్లకు ISIS కుట్ర.. భగ్నం చేసిన NIA అధికారులు
ISIS terrorists | ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)’ అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి. ఐసిస్‌కు చెందిన 8 మంది ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ‘నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)’ అధికారులు సోమవారం నిషేధిత ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ISIS)’ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేశారు. దేశావ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి. ఐసిస్‌కు చెందిన 8 మంది ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో దేశవ్యాప్తంగా మందుపాతరలు పేల్చి భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు.
కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు.. మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె.. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్, బొకారోతోపాటు దేశరాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ రైడ్స్ జరిగాయి. మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే ఉగ్రవాది నేతృత్వంలో దేశంలో పేలుళ్లకు కుట్ర జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
అరెస్టయిన 8 మంది ఉగ్రవాదుల్లో వారి నాయకుడు మహ్మద్ సులేమాన్ కూడా ఉన్నాడు. పట్టుబడిన ఉగ్రవాదుల పేర్లను ఎన్ఐఏ వెల్లడించింది. వారిలో మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్, సయ్యద్ సమీర్ ఇద్దరూ బళ్లారిలో పట్టుబడ్డారు. అనాస్ ఇక్బాల్ షేక్ ముంబైలో దొరికాడు. మహ్మద్ మునీరుద్దీన్, సయీద్ సమీయుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజామిల్ బెంగళూరులో అధికారులకు చిక్కారు.
షయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫికర్ అలియాస్ గుడ్డూను జంషెడ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. దేశంలో పేలుళ్లకు ISIS కుట్ర చేస్తున్నదని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందగానే 19 ప్రాంతాల్లోగల ఆ ఉగ్రవాద నెట్‌వర్క్‌లోని అనుమానితుల ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు రైడ్స్ చేశారు. కర్ణాటకలోని 11 ప్రాంతాల్లో, జార్ఖండ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలోని ఒక ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

