వ్యాపారి మన్సుఖ్ను ఊపిరాడకుండా చేసి హత్య

ముంబై: పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలలో కూడిన వాహనానికి చెందిన మన్సుఖ్ హిరేన్‌ను ఊపిరాకుండా చేసి హత్య చేసినట్లు ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్న ఎన్ఏఐ తెలిపింది. హిరేన్‌ను థానే క్రీక్‌లోకి విసిరే ముందు ఆయన నోట్లో పలు చేతిరూమాళ్లు కుక్కారని, ముఖంపైనా మరో గుడ్డను చుట్టారని, దీంతో ఊపిరాడక చనిపోయాడని ఒక అధికారి చెప్పారు. హత్యకు ముందు ప్రతిఘటించేందుకు హిరేన్ ప్రయత్నించారని, ఈ క్రమంలో ఆయన ముఖంపై పలుచోట్ల చర్మం గీసుకుని ఉన్నదని తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్టు, ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే దీనిపై ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసును తనపై వేసుకునేందుకు మన్సుఖ్ హిరేన్ ఒప్పుకోకపోవడంతో అతడ్ని హత్య చేయించాలని పోలీస్ అధికారి సచిన్ వాజే నిర్ణయించినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు.
మరోవైపు హిరేన్ హత్యను దర్యాప్తు చేస్తున్న మహారాష్ట యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) కూడా ఆయనను ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిర్ధాయించింది. ఆయన హత్యకు సంబంధించి ఇద్దరిని ఏటీఎస్ అరెస్ట్ చేసింది. మార్చి 5న ముంబ్రా-రెటి-బందర్ రోడ్ వెంబడి ఉన్న క్రీక్ నుంచి హిరేన్ మృతదేహాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

