Watch: ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళ.. చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుడిపైకి పంపిస్తానన్న హర్యానా సీఎం
Haryana CM Manohar Lal Khattar | ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళను కించపరిచేలా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ( Haryana CM Manohar Lal Khattar) మాట్లాడారు. తదుపరి చేపట్టే చంద్రయాన్-4 (Chandrayaan 4) మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని వ్యంగ్యంగా అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళను కించపరిచేలా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ( Haryana CM Manohar Lal Khattar) మాట్లాడారు. తదుపరి చేపట్టే చంద్రయాన్-4 (Chandrayaan 4) మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని వ్యంగ్యంగా అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా పైకి లేచిన ఒక మహిళ తమకు ఉపాధి కోసం ఫ్యాక్టరీ కావాలని అడిగింది. దీనికి సమాధానంగా తదుపరి చేపట్టే చంద్రయాన్-4 మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వ్యంగ్యంగా అన్నారు. ఆపై కూర్చోవాలని ఆమెకు చెప్పారు.
కాగా, ఈ సంఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పందించింది. హర్యానా సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి కోసం ఫ్యాక్టరీ కోరడమే ఆ మహిళ చేసిన ఏకైక నేరమా? అని ప్రశ్నించింది. ఇలాంటి సీఎం ఉండటం సిగ్గుచేటని విమర్శించింది. సేవ చేసేందుకు ప్రజల చేత ఎన్నికైన వారే ప్రజలను ఎగతాళి చేస్తున్నారని దుయ్యబట్టింది. మోదీ స్నేహితులైన కోటీశ్వరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇదే డిమాండ్ చేసి ఉంటే ఖట్టర్ వారిని ఆలింగనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం మొత్తాన్ని వారి సేవలో ఉంచేవారని ఆప్ మండిపడింది. అలాగే సీఎం ఖట్టర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
"अगली बार #Chandrayaan जाएगा तो उसमें तुमको भेज देंगे।"
धिक्कार है ऐसे मुख्यमंत्री पर। जिन्हें जनता ने सेवा करने के लिए चुना था आज वही जनता का मज़ाक़ उड़ा रहे हैं।
महिला का अपराध इतना था कि उसने रोजगार के लिए फैक्ट्री मांगी
यही मांग अगर मोदी जी के अरबपति मित्रों ने अपने… pic.twitter.com/OERfbfaCGt
— AAP (@AamAadmiParty) September 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

