Prajwal Revanna | ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను విమానాశ్రయంలోనే అరెస్టు చేస్తాం : హోంమంత్రి పరమేశ్వర
Prajwal Revanna | ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విమానం దిగగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర తెలిపారు. లైంగిక దాడి కేసులో ఆయనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 31న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది.
Prajwal Revanna | ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విమానం దిగగానే అరెస్టు చేస్తామని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర తెలిపారు. లైంగిక దాడి కేసులో ఆయనపై ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ నెల 31న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, తాను తప్పకుండా విచారణకు హాజరవుతానని ఇటీవల ప్రజ్వల్ వీడియో విడుదల చేసిన విషయం విధితమే. ఓ మహిళ చేసిన ఫిర్యాదు చేయగా.. ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమెటిక్ పాస్‌పోర్ట్‌పై జర్మనీ పోరిపోయినట్లుగా వార్తలు వచ్చాయి.
కర్ణాటకలో సంచనలం సృష్టించిన కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. బృందం దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో హోంమంత్రి పరమేశ్వర స్పందించారు. ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ విషయంలో ఎలాంటి ఆలస్యం చేయబోమన్నారు. విమానం దిగగానే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు తిరిగి రానున్న క్రమంలో ఆయనను ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసే విషయాన్ని సిట్ చూసుకుంటుందన్న ఆయన.. 31న ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు.
ఇదిలా ఉండగా.. ప్రజ్వల్ రేవణ్ణ ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. గడువు ఈ నెల 31తో ముగియనున్నది. ఎన్నికల్లో ఓడిపోతే ఆయన దౌత్య పాస్‌పోర్టును అక్కడి అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుంటారని.. అప్పుడైనా ఆయన తిరిగిరాక తప్పదని పరమేశ్వర వివరించారు. ఇవన్నీ అర్థం చేసుకునే ప్రజ్వల్ రేవణ్ణ భారత్ తిరిగొచ్చేయాలని నిర్ణయించుకొని ఉంటారని హోంమంత్రి వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

