Newborn Twins Murdered | తాను తండ్రిని కాదన్న భర్త.. అప్పుడే పుట్టిన కవలల గొంతు కోసిన తల్లి
Newborn Twins Murdered | అప్పుడే పుట్టిన నవజాత కవల బాలికలు అనుమానాస్పదంగా మరణించారు. పసి పాపల గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తొలుత ఆ శిశువుల తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే కన్న బిడ్డలను తల్లే చంపినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు
శ్రీనగర్: అప్పుడే పుట్టిన నవజాత కవల బాలికలు అనుమానాస్పదంగా మరణించారు. పసి పాపల గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. (Newborn Twins Murdered) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తొలుత ఆ శిశువుల తండ్రిని అరెస్ట్ చేశారు. అయితే కన్న బిడ్డలను తల్లే చంపినట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మెంధార్ సబ్ డివిజన్లోని చైజ్ల కయాని గ్రామంలోని పొలం వద్ద అప్పుడే పుట్టిన ఆడపిల్లలు హత్యకు గురయ్యారు. నవజాత కవల బాలికల గొంతు కోసి చంపారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. హత్యకు గురైన నవజాత కవల బాలికల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం కోసం డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆడ పిల్లలు పుట్టారన్న నిరాశతో కన్న తండ్రి వారిని చంపి ఉంటాడని పోలీసులు తొలుత అనుమానించారు. మహ్మద్ ఖుర్షీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
మరోవైపు సౌదీ అరేబియాలో పనిచేస్తున్న మహ్మద్ ఖుర్షీద్ మూడు నెలల కిందట ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం భార్య కవలలకు జన్మనివ్వడంతో తాను తండ్రిని కాదని ఆమెతో అన్నాడు. భార్య అక్రమ సంబంధాన్ని అనుమానించాడు. దీంతో భయపడిన ఆ మహిళ నవజాత శిశువులను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లింది. గొంతు కోసి హత్య చేసి అక్కడ వదిలేసింది. పోలీసులు గట్టిగా నిలదీయగా ఈ విషయాన్ని ఒప్పుకుంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఒక రోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. నవజాత కవల బాలికలు హత్యకు గురయ్యారు. కొడుకు పుట్టలేదన్న నిరాశతో 32 ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల కిందట పుట్టిన కవల కుమార్తెలను చంపాడు. సుల్తాన్‌పురి ప్రాంతంలోని ఇంటి సమీపంలో పాతిపెట్టాడు. ఈ సంఘటన దేశ రాజధానిలో కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

