New Mobile | మార్కెట్లోకి పోకో కొత్త మొబైల్.. ధర ఎంతో తెలుసా..?
New Mobile | చైనా దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘పోకో (Poco)’.. పోకో సీ65 (Poco C65) పేరిట మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్‌ను 5,000 mAh బ్యాటరీ కెపాసిటీతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ స్టోరేజీ సామర్థ్యం 128 జీబీ. అయితే దీన్ని మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
New Mobile: చైనా దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘పోకో (Poco)’.. పోకో సీ65 (Poco C65) పేరిట మరో కొత్త మొబైల్‌ను లాంచ్ చేసింది. ఈ మొబైల్‌ను 5,000 mAh బ్యాటరీ కెపాసిటీతో బడ్జెట్ ధరలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ స్టోరేజీ సామర్థ్యం 128 జీబీ. అయితే దీన్ని మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
పోకో కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ధరను రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. అదేవిధంగా 6 జీబీ + 128 జీబీ వేరియంట్ మొబైల్ ధరను రూ.10,999గా పేర్కొంది. మ్యాట్ బ్లాక్, పాస్టెల్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. పోకో వెబ్సైట్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రకటించింది.
ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి కంపెనీ రూ.1,000 డిస్కౌంట్ అందించనుంది. ఈ మొబైల్ కొనుగోలుపై ఈఎంఐ (EMI) సదుపాయం కూడా ఉన్నట్లు పోకో పేర్కొన్నది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ 13 (Android 13) ఎమ్ఐయూఐ 14తో పనిచేస్తుంది. పైగా 6.74 అంగుళాల హెచ్డీ + ఎల్ఈడీ స్క్రీన్ ఇస్తున్నారు. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ సాంప్లింగ్ రేట్‌తో వస్తోంది.
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఇచ్చారు. వెనుక వైపు 50 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ మైక్రో కెమెరా ఇచ్చారు. వీడియో కాల్, సెల్ఫీ కోసం ముందుభాగంలో 8 ఎంపీ కెమెరా ఇచ్చారు. 5,000 mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ లాంటి సదుపాయాలు ఈ ఫోన్లో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

