న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి పరీక్ష విజయవంతం

భువనేశ్వర్: న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (ఆకాష్-ఎన్జీ)ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) బుధవారం పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటిఆర్) నుంచి చేపట్టిన ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైందని డీఆర్డీవో తెలిపింది. లక్ష్య ప్రమాణాల మేరకు టెస్ట్ జరిగినట్లు పేర్కొంది.
మరోవైపు ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఆర్మీని బలోపేతం చేసేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తక్కువ బరువున్న మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని డీఆర్డీవో బుధవారం విజయవంతంగా పరీక్షించింది. థర్మల్ సైట్‌తో అనుసంధానించిన మ్యాన్-పోర్టబుల్ లాంచర్ నుండి ఈ క్షిపణిని ప్రయోగించినట్లు డీఆర్డీవో తెలిపింది. ట్యాంక్ నమూనా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో నాశనం చేసిందని, కనీస పరిధి పరీక్ష విజయవంతమైందని, మిషన్ లక్ష్యాలన్నీ నెరవేరాయని వెల్లడించింది.

మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఇప్పటికే గరిష్ట శ్రేణి కోసం విజయవంతంగా టెస్ట్ చేసినట్లు డీఆర్డీవో వివరించింది. అధునాతన ఏవియానిక్స్‌తో పాటు అత్యాధునిక మినిటరైజ్డ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సీకర్‌తో ఈ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

