PM Modi | పార్లమెంటు ఉద్యోగుల డ్రెస్‌పై బీజేపీ కమలం పువ్వులు.. మోదీ సర్కార్ నిర్ణయంపై వెల్లువెత్తుతున్న నిరసనలు
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ‘వ్యవస్థల బీజేపీకరణ’ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే ముగిసిన జీ20 సదస్సును మొత్తం బీజేపీ సమావేశాలుగా మార్చేసిందన్న విమర్శలు సమసిపోకముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది.
PM Modi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు ‘వ్యవస్థల బీజేపీకరణ’ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవలే ముగిసిన జీ20 సదస్సును మొత్తం బీజేపీ సమావేశాలుగా మార్చేసిందన్న విమర్శలు సమసిపోకముందే మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. పార్లమెంటు ఉభయసభల్లో పనిచేసే ఉద్యోగులు, మార్షల్స్‌కు బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పుష్పాలతో కూడిన నూతన యూనిఫాంను రూపొందించింది. ఈ నెల 18వ తేదీనుంచి నిర్వహించే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఈ యూనిఫాంలతోనే ఉద్యోగులు దర్శనమివ్వనున్నారు. ఉద్యోగులందరికీ కొత్త యూనిఫాంలను ఈ నెల 7వ తేదీనే అందజేసినట్టు జాతీయ మీడియా తెలిపింది.
కుర్తా, పైజామా, చీర
పార్లమెంటు ఉభయసభల్లో మార్షల్స్ ఇతర ఉద్యోగులు కలిపి 271 మంది పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటివరకు విధి నిర్వహణ సమయంలో సఫారీలు ధరించేవారు. వాటి స్థానంలో భారత సంప్రదాయ యూనిఫాంను మోదీ సర్కారు ప్రవేశపెట్టింది. అయితే, వాటిపై బీజేపీ గుర్తును ముద్రించటం తీవ్ర దుమారం రేపుతున్నది. పురుష ఉద్యోగులు ఇకపై క్రీమ్ కలర్ కుర్తా పైజామా ధరిస్తారు. మహిళా ఉద్యోగులు అదేరంగు చీరలు ధరిస్తారు. వీటన్నింటిపై కాషాయ రంగులో చిన్నచిన్న కమలం పుష్పాలు ముద్రించి ఉంటాయి. ఈ యూనిఫాంలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) డిజైన్ చేసినట్టు సమాచారం. ఈ యూనిఫాంపై రాజకీయ దుమారం రేగుతున్నది. కొత్త యూనిఫాంపై బీజేపీ ఎన్నికల గుర్తును ఎలా ముద్రిస్తారని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మానికమ్ ఠాకూర్ ప్రశ్నించారు. పార్లమెంటును బీజేపీ తన సొంత ఇలాఖాలా భావిస్తున్నదని మండిపడ్డారు. ‘కమలాన్ని ఒక్కదాన్నే ఎందుకు ముద్రించారు? నెమలిని, పులిని ఎందుకు ముద్రించలేదు? ఓహో.. అవి బీజేపీ ఎన్నికల సింబల్స్ కావు కాబట్టి ముద్రించలేదా? ఓం బిర్లా (లోక్‌సభ స్పీకర్) గారూ.. ఇంత దిగజారటం ఎందుకండి?’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

