New CEC | సీఈసీ ఎంపిక కోసం ప్రధాని అధ్యక్షతన ఉన్నతస్థాయి భేటీ.. వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
New CEC | కొత్త ఎన్నికల ప్రధాన అధికారి (CEC) ఎంపిక కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారం (ఫిబ్రవరి 18)తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంపిక వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు కాంగ్రెస్ నేతలు అభిషేక్ సింఘ్వి, అజయ్ మాకెన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఈసీ నియామకం అంశంపై సుప్రీంకోర్టులో ఈ నెల 19న విచారణ జరుగుతుందని.. ఈ క్రమంలో భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వాస్తవానికి గతేడాది నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సీఈసీ, ఈసీల నియామకానికి కొత్త చట్టం పార్లమెంట్లో తీసుకువచ్చి ఆమోదించింది. ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం సభ్యుడిగా ఉండగా.. ఆయన స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి అవకాశం కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

