PhonePe CEO | ఏనాడూ కర్ణాటకను కించపర్చలేదు.. ఫోన్‌పే సీఈఓ భేషరతు క్షమాపణ..
PhonePe CEO | తనకు కర్ణాటక అన్నా, కన్నడ భాష అన్న గౌరవం అని ఫోన్ పే ఫౌండర్, సీఈఓ సమీర్ నిగమ్ వివరణ ఇచ్చారు. కర్ణాటక ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పారు.
PhonePe CEO | ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జాబ్ కోటా బిల్లుపై ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ఫోన్‌పే ఫౌండర్, సీఈఓ సమీర్ నిగమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీంతో ఆయన స్పందించారు. భేషరతుగా కర్ణాటక వాసులకు క్షమాపణ చెబుతున్నట్లు ఆదివారం తెలిపారు. తనకు ఏనాడూ కర్ణాటకను కించపర్చాలన్న ఆలోచన, ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సమీర్ నిగమ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఫోన్‌పేను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తడంతో ఆయన దిగి వచ్చారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా ఫోన్‌పే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సమీర్ నిగం వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్రాన్ని, కన్నడిగులను కించపర్చడమేని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో సమీర్ నిగం వ్యక్తిగత ప్రకటన చేస్తూ తనకు కర్ణాటక అంటే గౌరవం ఉందని, తనకు ఏ ఒక్కరినీ కించపర్చాలన్న ఉద్దేశం లేదని క్లారిఫికేషన్ ఇచ్చారు. ‘కర్ణాటకలోనే ఫోన్‌పే పుట్టింది. ఈ నగరంతో మా మూలాలు ఇమిడి ఉన్నందుకు మేం గర్విస్తున్నాం. వైవిధ్యభరితమైన అసాధారణ సాంకేతిక పరిజ్ఞానానికి పెట్టింది పేరు బెంగళూరు’ అని సమీర్ నిగమ్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా బాధ కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కన్నడంతోపాటు భారతీయ భాషల పట్ల తన గౌరవం ఉందని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం జాబ్ కోటా బిల్లును కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ను పెట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

