నా మృతదేహం కూడా.. బీజేపీలో చేరదు: కపిల్ సిబల్

న్యూఢిల్లీ: తాను బతికి ఉండగానే కాదు.. తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ బీజేపీలో చేరాలని అనుకోలేదన్నారు. ఒకవేళ, కాంగ్రెస్ నాయకత్వం తనను పార్టీ వీడాలని కోరితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తానని, అయితే బీజేపీలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ మేరకు గురువారం స్పందించారు.
కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న సమస్యలు ఏమిటో తనకు ఖచ్చితంగా తెలుసునని సిబల్ అన్నారు. తమ సమస్యలను పార్టీ నాయకత్వం వింటుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. చెప్పేది వినకుండానే ఎవరూ మనుగడ సాగించలేరని, కార్పొరేట్ నిర్మాణం కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. మాట వినకపోతే ఎవరైనా చెడ్డ రోజులలో పడతారని ఆయన వ్యాఖ్యానించారు.
జితిన్ ప్రసాద్ చేసిన దానికి తాను వ్యతిరేకం కాదని కపిల్ సిబల్ అన్నారు. అయితే బహిర్గతం చేయని కొన్ని కారణాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఆయన బీజేపీలో ఎందుకు చేరుతున్నారో అన్నది తనకు అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. అయితే ‘ఆయా రామ్ గయా రామ్.. రాజకీయాలకు నిదర్శనమన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

