దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదు : సీరం

ఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనవల్లా అన్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌పై సీరం సంస్థ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి తాము టీకాలు ఎగుమతి చేయలేదన్నారు.
దేశంలో వ్యాక్సినేషన్‌కు సహకరించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 20 కోట్ల టీకా డోసులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. భారత్ వంటి దేశంలో 2 నుంచి3 నెలల్లో వ్యాక్సినేషన్ చేయలేమన్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్లో అనేక సవాళ్లు ఉన్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశాల్లో భారత్ ఒకటి అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు 2 నుంచి 3 ఏళ్లు పడుతుందన్నారు. అమెరికా కంపెనీల కంటే తమకు 2 నెలలు ఆలస్యంగా అనుమతులు వచ్చాయన్నారు. ఉత్పత్తిపరంగా ప్రపంచంలోనే తమది మూడో స్థానమన్నారు. ఈ ఏడాది చివరకు మాత్రమే విదేశాలకు టీకాలు సరఫరా చేస్తామన్నారు. కరోనాపై యుద్ధానికి అంతా కలిసికట్టుగా పోరాడాలని సీరం పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

