నడ్డా.. సర్కారీ కొలువు వద్దా?
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస్తారు’ అని. ఈయనగారేదో ఉద్యోగాలను
మీ బీజేపీ రాజ్యాంగంలో రాశారా: నిలదీస్తున్న నెటిజన్లు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ తమది అని చెప్పుకొనే పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. ఆయనేనండీ! బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనగారు ఏమంటున్నారంటే.. ‘50 వేల జీతం తీసుకొనేవాళ్లు కూడా సర్కారీ కొలువు కోసం చూస్తారు’ అని. ఈయనగారేదో ఉద్యోగాలను ఉచితంగా పంచిపెట్టినట్టు. అంతేలే! ప్రభుత్వ ఉద్యోగాలను పీకేసేటోళ్లు, ప్రభుత్వ సంస్థలను అమ్మేటోళ్లు ఇంతకన్నా ఇంకెలా మాట్లాడుతారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని నరం లేని నాలుకతో హామీలిచ్చిన ఈ బీజేపీ పెద్దలు.. నిరుద్యోగులను నయవంచన చేసింది తెలిసిందేగా! ఎనిమిదేండ్లుగా కండ్లారా చూస్తున్నదేగా! ప్రభుత్వ రంగ సంస్థలను బేరం పెట్టి, పబ్బం గడుపుకొనే బీజేపీకి.. ఉద్యోగుల భద్రత గురించి ఏం తెలుస్తుందిలే! ‘50 వేలు సంపాదించినా..’ అని అంటున్నారీయన. ఈయనో, ఈయన పెద్ద సారు మోదీనో, చిన్న సారు అమిత్‌షానో దేశంలోని ప్రతీ ఒక్కరి అకౌంట్లలో వేసిన డబ్బులేం కావుగా! కాయాకష్టం చేసి, చెమట నీరు చిందించి సంపాదించుకొంటున్నవే. ఏ.. 50 వేలు సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవద్దని రూలేమైనా పెట్టారా? లేక వీరే దొడ్డిదారిన చట్టంలో చేర్చారా ఏంటి? దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తున్నదని సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. నడ్డా గారు.. ప్రభుత్వ ఉద్యోగాలు మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చినవేం కాదండీ. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని సగటు నిరుద్యోగి అంటున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- constitution
- Jp Nadda
- Netizens
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

