Baba Ramdev | యుద్ధంలో అమెరికా గెలువదు, ఇరాన్ ఓడదు.. రాందేవ్ బాబా కామెంట్
Baba Ramdev | ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న యుద్ధంపై యోగా గురు, పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలువదని, ఇరాన్ ఓడిపోదని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
Baba Ramdev : ఇరాన్ (Iran) పై అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) చేస్తున్న యుద్ధంపై యోగా గురు, పతంజలి సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ (Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా గెలువదని, ఇరాన్ ఓడిపోదని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హరిద్వార్ (Haridwar) లోని పతంజలి యోగపీఠ్ (Yoga Peeth) లో ఇవాళ జరిగిన రామనవమి వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ఈ యుద్ధంలో అమెరికా గెలువదు, ఇరాన్ ఓడిపోదని నేను గతంలో చెప్పాను. 1000-1200 కిలోమీటర్ల నుంచి 4000-5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా.. కేవలం ఆయుధాలను వినియోగించడం ద్వారా ఎవరూ ఎవరినీ భయపెట్టలేరని ఇరాన్ నిరూపించింది’ అని రాందేవ్ విశ్లేషించారు. ప్రజాస్వామ్యం అంటే ఇతరులను భయపెట్టడం కాదని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వపడే అమెరికా, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించాలని చెప్పారు.
పశ్చిమాసియాలో సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్ కీలకపాత్ర పోషించాలని రాందేవ్ ఆకాంక్షించారు. ‘వసుధైక కుటుంబం’ అనే సిద్ధాంతం ఆధారంగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలన్న సందేశాన్ని భారత్ ఇస్తూనే ఉండాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయంగా, దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారని కొనియాడారు. ఎవరైనా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆపగలిగితే అది భారతే అన్నారు. ఈ యుద్ధం వల్ల తలెత్తిన పెట్రోల్, గ్యాస్ సంక్షోభానికి, ప్రపంచ ఆర్థిక మాంద్యానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
అదే సమయంలో శ్రీరామనవమి పర్వదినం ప్రాముఖ్యతను వివరిస్తూ.. దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. డిజిటల్ మీడియా ప్రభావంతో యువత, ముఖ్యంగా కుమార్తెల శీలం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి పండుగలను పిల్లల్లో మన గొప్ప సాంస్కృతిక వారసత్వంపై బలమైన అవగాహన కల్పించడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. దేశ విదేశాంగ విధానం లాంటి జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- America
- baba ramdev
- iran
- West Asia
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

