Independent India : నెహ్రూ తొలి చారిత్రాత్మక ప్రసంగం
Independent India : 1947 లో సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ సభ సమావేశ మందిరంలో భారతదేశం తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఒకరోజు ముందుగా ప్రారంభమైన ...

ఎన్నో ఉద్యమాలు… మరెన్నో పోరాటాలు… ఎందరో ప్రాణార్పణం… మరెందరో బలిదానం… వీటన్నింటి ఫలితమే మనం ఇవ్వాళ స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాల పండుగను (Independent India) ఘనంగా జరుపుకుంటున్నాం. 1947 లో సరిగ్గా ఇదే రోజున రాజ్యాంగ సభ సమావేశ మందిరంలో భారతదేశం తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఒకరోజు ముందుగా ప్రారంభమైన స్వాతంత్య్ర దినోత్సవాలు మరుసటి రోజు వరకు కొనసాగాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఉత్సవాలు జరుపుకున్నారు.
15 ఆగస్ట్‌కు ముందు రోజు..
14 ఆగస్ట్ రాత్రి 11 గంటలు : న్యూఢిల్లీలో స్వాతంత్య్రదిన ఉత్సవాలు ప్రారంభం. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించారు.
11.30 : వందేమాతరం గీతాలాపన. అమరవీరులను స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.
11.55 : ప్రజలను ఉద్దేశించి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, చౌదరి ఖాలికజామా, జవహర్లాల్ నెహ్రూలు ప్రసంగించారు.
12 : సమరశంఖం పూరించిన సమరయోధులు. ప్రజలు ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున వర్షం కురుస్తున్నప్పటికీ పార్లమెంట్ భవనం ఆవల వేలాది మంది ప్రజానీకం నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగిపోయారు.
12.30 : జాతీయ పతాకం ప్రదర్శన అనంతరం క్యాబినెట్ మంత్రుల పేర్లున్న కవర్‌ను గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్‌కు అందజేసిన నెహ్రూ.
ఆగస్ట్ 15
ఉదయం 8 గంటలు : గవర్నమెంట్ హౌస్‌లో మంత్రుల ప్రమాణస్వీకారం. తొలుత ప్రధానమంత్రిగా నెహ్రూ ప్రమాణం, ఆ తర్వాత 13 మంత్రులుగా ప్రమాణం చేశారు.
9.40 : రాజ్యాంగ సభ భవనంలో నెహ్రూ అధ్యక్షతన తొలి క్యాబినెట్ సమావేశం
9.55 : గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్‌కు రాయల్ సెల్యూల్
10.30 : రాజ్యాంగ సభ భవనం ప్రాంగణంలో తొలిసారి జాతీయ పతాకం ఆవిష్కరణ
5 : ఇండియా గేట సమీపంలోని ప్రిన్సెస్ పార్క్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన మౌంట్ బాటన్
7.45 : పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు
10 : గవర్నమెంట్ హౌస్‌లో మౌంట్‌బాటన్ ఆధ్వర్యంలో అధికారిక విందు
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2018 : ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి, 48 మంది మృతి
1975 : రమేశ్ సిప్పి దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ సినిమా ‘షోలే’ విడుదల
1971 : బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న బహ్రెయిన్
1960 : ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న రిపబ్లిక్ ఆఫ్ కాంగో
1950 : ఆసోం, టిబెట్ ప్రాంతంలో భూకంపం, 30 వేలకు పైగా జనం దుర్మరణం
ఇవి కూడా చదవండి..
ఈ గోల్డ్ మెడలిస్ట్ కష్టాలు తీరెదెలా..?
పనుల్లో బిజీగా ఉన్నారా? ఈ ఆహారాలతో ఆరోగ్యం పొందండి!
టీ20 వరల్డ్ కప్‌కు ఐసీసీ మార్గదర్శకాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

