న్యూఢిల్లీ, మార్చి 24: రామ్చరణ్ తొలి సినిమా చిరుత గుర్తుందా? అందులో హీరోయిన్గా నటించిన నటి నేహా శర్మ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బీహార్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం భాగల్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి అజిత్ శర్మ దీనిపై మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం, తాను కూడా నేహా శర్మ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నామన్నారు.
ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావించగా, వివిధ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నానని, ఎన్నికలలో పోటీ చేసే సమయం లేదని చెప్పిందని తెలిపారు. ‘ఐదారు నెలల ముందు ఈ ప్రతిపాదన తెచ్చి ఉంటే తప్పక అంగీకరించే దానిని’ అని పేర్కొందన్నారు.