సింపుల్ అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించిన నిట్ యూనివర్శిటీ

ఢిల్లీ, మే,11: నిట్ యూనివర్శిటీ 2021 బ్యాచ్ కోసం వినూత్నమైన ఆన్లైన్ అడ్మి షన్ ఇంటరాక్షన్ ప్రక్రియ (ఏఐపీ)ను ప్రారంభించింది. యూనివర్శిటీలో చేరే విద్యార్థులకు సౌకర్యవంతమైన దరఖాస్తు ప్రక్రియను ఇది అందిస్తుంది. ఈ ఆన్లైన్ అడ్మిషన్ ఇంటరాక్షన్ ప్రక్రియ రెండు మార్గాల ప్రక్రియ. ఇది విద్యార్థులను వారి విద్యా రికార్డుల పరంగా మాత్రమే గాక వారి సమగ్ర వ్యక్తిత్వం, ఆసక్తి, ఇంట్రెస్ట్ ఆధారంగా పరిశీలిస్తుంది. విద్యార్థులు తమ 10వ తరగతి స్కోర్, వ్యక్తిగత సంభాషణ ఆధారంగా 12 క్లాస్ బోర్డు ఫలితాలతో సంబంధం లేకుండా అడ్మిషన్ పొందవచ్చు.
ఈ ఏఐపీలో మూడు ప్రధాన విభాగాలుంటాయి. అవి విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కెరీర్ లక్ష్యాలు, స్వీయ అవగాహనను అంచనా వేస్తూ ప్రశ్నావళి ; అప్టిట్యూడ్ పరీక్ష, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్‌ప్రిటేషన్, ఆంగ్ల భాషా నైపుణ్యం పరీక్షిస్తూ ఎన్యు ఏటీ ఎంసీక్యు చివరగా విద్యార్థులతో ముఖాముఖి సంభాషణల ద్వారా వారి భవిష్యత్ లక్ష్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను అంచనా వేస్తారు.
‘‘పీర్ టు పీర్ అభ్యాసాన్ని ప్రోత్సహించే రీతిలో వాతావరణం సృష్టించడానికి ఎన్యు ప్రయత్నిస్తుంటుంది. ఈ ఏఐపీ అలా చేసేందుకు మాకు వీలు కల్పించింది. ఈ ప్రక్రియ విద్యార్థులను అంచనా వేయడంతో పాటు విద్యార్థుల కోరికలు, ఇనిస్టిట్యూషన్స్ ఆఫరింగ్స్ నడుమ సమతుల్యతను సృష్టించేందుకు సైతం తోడ్పడుతుంది’’ అని నిట్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ పరిమల్ మండ్కే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

