CSIR | సీఎస్ఐఆర్ పరీక్షలోనూ అక్రమాలు?
నీట్-యూజీ, నెట్ పరీక్షల్లో అక్రమాలపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుండగానే సీఎస్ఐఆర్ నియామక పరీక్షలోనూ అవతకవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ‘ది వైర్' పరిశోధనాత్మక కథనం ప్రచురించింది.
- ఎస్ఓ, ఏఎస్ఓ నియామకాలకు జూలై 7న పరీక్ష నిర్వహణ
- బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీకి ఎగ్జామ్ కాంట్రాక్టు అప్పగింత
- అవకతవకలకు అవకాశం కల్పించేలా సాఫ్ట్వేర్
- కొందరికి పరీక్ష సిబ్బంది సహకరించినట్టు ఆరోపణలు
- క్లాస్రూములా పరీక్ష కేంద్రం.. వీడియో వైరల్
- సీఎస్ఐఆర్ పరీక్షలో అక్రమాలపై ‘ది వైర్’ వెబ్సైట్ కథనం
CSIR | న్యూఢిల్లీ, జూలై 18: నీట్-యూజీ, నెట్ పరీక్షల్లో అక్రమాలపై సర్వత్రా ఆందోళన కొనసాగుతుండగానే సీఎస్ఐఆర్ నియామక పరీక్షలోనూ అవతకవకలు జరిగాయనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ‘ది వైర్’ పరిశోధనాత్మక కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా ఉండే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్)లో సెక్షన్ ఆఫీసర్(ఎస్ఓ), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(ఏఎస్ఓ) ఉద్యోగాల భర్తీకి జూలై 7న రెండో దఫా పరీక్ష జరిగింది. పరీక్ష నిర్వహించడంలో సీఎస్ఐఆర్ పూర్తిగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీకి కాంట్రాక్టు
మొదటి విడత పరీక్షలో ఎంపికైన విద్యార్థులకు రెండో విడతగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీపీటీ) నిర్వహించారు. ఈ పరీక్ష నిర్వహించే కాంట్రాక్టును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఎడ్యుటెస్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సీఎస్ఐఆర్ అప్పగించింది.
అయితే, ఈ సంస్థను గతంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. మొదటి దఫా పరీక్షపై ఆరోపణలు వచ్చినప్పటికీ రెండో దఫా పరీక్ష నిర్వహించే బాధ్యతలను కూడా ఈ కంపెనీకే సీఎస్ఐఆర్ ఇచ్చింది. ఈ కంపెనీ గుజరాత్‌కు చెందిన బీజేపీ సన్నిహితులదిగా ‘ది వైర్’ పేర్కొన్నది. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు సురేశ్‌చంద్ర ఆర్య అధ్యక్షుడిగా ఉన్న ఓ సంఘం కార్యక్రమాలకు గతంలో ప్రధాని మోదీ సైతం హాజరయ్యారని తెలిపింది. ఈ సంస్థ ఎండీ వినీత్ ఆర్య గతంలో ఓ పేపర్ లీక్ కేసులో జైలుకు కూడా వెళ్లినట్టు వైర్ తన కథనంలో తెలియజేసింది.
అక్రమాలకు తావిచ్చేలా సాఫ్ట్వేర్
సీపీటీ పరీక్ష జరుగుతున్నప్పుడు పరీక్ష కేంద్రాల్లో తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అభ్యర్థులు గుంపులుగా ఉండటం, మాట్లాడుకుంటున్నట్టు వీటిల్లో కనిపిస్తున్నది. సాధారణంగా సీపీటీ పరీక్ష జరిగేటప్పుడు కంప్యూటర్ మొత్తంపై అభ్యర్థులకు నియంత్రణ ఉండొద్దు. కేవలం పరీక్ష జరిగే వెబ్‌పేజీ మాత్రమే కనిపించాలి. కానీ, ఈ పరీక్ష జరిపిన సాఫ్ట్వేర్ అక్రమాలకు అవకాశం కల్పించేలా ఉందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. కంప్యూటర్లోని వేరే ఫైల్స్‌పై అభ్యర్థులకు నియంత్రణ లభించేలా సాఫ్ట్వేర్ ఉందని, పెన్‌డ్రైవ్ కూడా వినియోగించే అవకాశం ఉందని చెప్తున్నారు. పరీక్ష నిర్వహించిన సిబ్బంది కొందరు అభ్యర్థులకు సహకరించారని సైతం పలువురు ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

