Student Suicide | కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15 మంది..
రాజస్థాన్‌లో కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు (Student Suicide) ఆగడం లేదు. తాజాగా నీట్‌కు (NEET) సన్నద్ధమవుతున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నది. జమ్ముకశ్మీర్‌కు చెందిన జీషన్ అనే విద్యార్థిని కోటాలోని ప్రతాప్ చౌరహా అనే ప్రాంతంలోని హాస్టల్ పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు ప్రిపేర్ అవుతున్నది.
కోటా: రాజస్థాన్‌లో కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు (Student Suicide) ఆగడం లేదు. తాజాగా నీట్‌కు (NEET) సన్నద్ధమవుతున్న అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నది. జమ్ముకశ్మీర్‌కు చెందిన జీషన్ అనే విద్యార్థిని కోటాలోని ప్రతాప్ చౌరహా అనే ప్రాంతంలోని హాస్టల్ పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ వైద్య విద్య ప్రవేశ పరీక్ష అయిన నీట్‌కు ప్రిపేర్ అవుతున్నది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తానుంటున్న రూమ్‌లోనే ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. అయితే అంతకుముందు తన బంధువులతో ఫోన్లో మాట్లాడిందని, తాను చనిపోతున్నానని చెప్పిందని పోలీసులు వెల్లడించారు.
దీంతో ఆమె వెంటనే అదే బిల్డింగ్‌లో పై అంతస్తులో ఉంటున్న మమత అనే మరో విద్యార్థినికి విషయం చెప్పారని తెలిపారు. ఆమె జీషన్ గదికి వెళ్లి చూడగా అప్పటికే తలుపులు లాక్ చేసుకుందని, మమత అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి వాటిని బద్దలుకొట్టారని, అయితే అప్పటికే ఆమె సీలింగ్‌కు వేలాడుతూ కనిపించిందని వెల్లడించారు. దీంతో వారు జీషన్‌ను హుటాహుటిన దవాఖానకు తరలించారని, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారమన్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటివరకు కోటాలో 15 మంది విద్యార్థులు చనిపోగా, ఈ నెలలో ఇది రెండో మరణం.
కోటాలోనే ఎందుకు..
విద్యార్థుల ఆత్మహత్యలు కోటాలోనే ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని రాజస్థాన్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇది పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సంవత్సరం మే 23 నాటికి కోటాలో 14 ఆత్మహత్యలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
‘ఒక రాష్ట్రంగా మీరేం చేస్తున్నారు? పిల్లలు కేవలం కోటాలోనే ఎందుకు ఆత్మహత్య చేసుకొంటున్నారు? ఒక ప్రభుత్వంగా మీరు దీని గురించి ఆలోచించలేదా?’ అని జస్టిస్ పార్థీవాలా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఓ ఐఐటీ-ఖరగ్‌పూర్ విద్యార్థి ఆత్మహత్య, కోటాలో ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న నీట్ విద్యార్థిని ఆత్మహత్య కేసుల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

