అసోంలో ఒకేసారి 100 రాబందులు మృతి.. ఆ మాంసమే కారణమా..?
గువహటి : ఒకేసారి 100 రాబందులు మృతి చెందాయి. పలు రాబందులు తీవ్ర అనారోగ్యానికి గురై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్నాయి. ఈ ఘటన అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్ ఏరియాలో వెలుగు చూసింది.
ఒకే సారి ఒకే చోట 100 రాబందులు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. మరిన్ని రాబందులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వాటికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే 100 రాంబదులు ఒకేసారి చనిపోవడం ఇదే ప్రథమం అని తెలిపారు. రాబందులు చనిపోయి ఉన్న ప్రదేశంలో గొర్రెల మాంసం, ఎముకలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. చనిపోయిన గొర్రెల మాంసం, ఎముకలను తినడం వల్లే రాబందులు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ మాంసం విషపూరితంగా ఉండొచ్చని, అందువల్లే పెద్ద సంఖ్యలో రాబందులు చనిపోయాయని పేర్కొన్నారు. రాబందుల మృతికి కచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదికలో వెల్లడి కానుంది.
గొర్రెల మాంసంలో విషం
ఉద్దేశపూర్వకంగానే గొర్రెల మాంసంలో విషం కలిపారని, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇలాంటి ఘటనే ఈ ఏరియాలో చోటు చేసుకుందని అధికారులు గుర్తు చేశారు. అయితే అప్పుడు ఈ స్థాయిలో పక్షులు మృతి చెందలేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
About 100 vultures have been found dead and many critical at Milanpur, Chaiygaon.
The doctors and field staffs are trying their best to treat the critical ones pic.twitter.com/WUUJa1G1nx
— Assam Forest Department (@assamforest) March 17, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

