Narendra Modi | మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు శుభాకాంక్షలు : మోదీ
Narendra Modi | రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Narendra Modi : రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రపతిని కలిసి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తీర్మాన ప్రతిని ఆమె అందజేశానని చెప్పారు.
ఈ సందర్భంగా తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. ఎన్డీఏ మిత్రపక్షాల తీర్మానాన్ని పరిశీలించిన అనంతరం ద్రౌపది ముర్ము మోదీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆదివారం సాయంత్రం తాను మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు మోదీ వెల్లడించారు.
ఆజాదీకా అమృత్ కాల్ ఉత్సవాల తర్వాత ఇవి తొలి ఎన్నికలని, దేశానికి సేవచేసే అవకాశం మాకు మూడోసారి లభించిందని నరేంద్రమోదీ అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగ్గట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. మంత్రిమండలి ఏర్పాటుకు రాష్ట్రపతి పలు సూచనలు చేశారని, ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త మంత్రుల పేర్లను రాష్ట్రపతికి అందజేస్తామని తెలిపారు. మున్ముందు మరింత బాధ్యత, ఉత్సాహంతో పనిచేస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

