Rahul Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ పోస్టు.. ఫేస్‌బుక్‌కు సమన్లు

న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు సంబంధించిన వివరాలను రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ ఘటనలో ఇవాళ చిన్నారుల హక్కుల సంస్థ ఎన్సీపీసీఆర్.. ఫేస్బుక్ అధికారులకు సమన్లు జారీ చేసింది. రాహుల్ పోస్టు చేసిన విషయంపై తాము ఇచ్చిన నోటీసుకు స్పందించకపోవడంతో ఎన్సీపీసీఆర్ ఆ సమన్లు జారీ చేయాల్సి వచ్చింది. మంగళవారం సాయంత్రం 5 గంటల తమ ముందు హాజరుకావాలని ఎన్సీపీసీఆర్ తన ఆదేశాల్లో పేర్కొన్నది. వీలుకాని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకావాలని సూచించింది. ఫోటో, వీడియో షేరింగ్ నెట్వర్క్ ఫ్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్.. ఫేస్‌బుక్‌కు చెందినది. బాధిత కుటుంబానికి చెందిన వీడియో ఇన్‌ష్టాలో పోస్టు రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కు ఎన్సీపీసీఆర్ నోటీసు ఇచ్చింది. ఈ ఘటనలో ఎటువంటి చర్య తీసుకున్నట్లు ఫేస్బుక్ స్పష్టం చేయలేదు. దీంతో ఫేస్‌బుక్‌కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. రాహుల్ తన ఇన్‌స్టా ప్రోఫైల్‌తో జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ను ఉల్లంఘించినట్లు ఆరోపించింది. పోక్సో చట్టం ప్రకారం సోషల్ మీడియా లేదా ఇతర పద్ధతుల్లో బాధిత కుటుంబ వివరాలను వెల్లడించరాదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

