Supriya Sule | డీలిమిటేషన్ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : సుప్రియా సూలే
Supriya Sule | డీలిమిటేషన్ బిల్లు (Delimitation bill) పై తమ పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం) (NCP (SP)) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) స్పష్టంచేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారం ‘టీకప్పులో తుపాను’ లాంటిదేనని పేర్కొన్నారు.
Supriya Sule : డీలిమిటేషన్ బిల్లు (Delimitation bill) పై తమ పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం) (NCP (SP)) వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే (Supriya Sule) స్పష్టంచేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారం ‘టీకప్పులో తుపాను’ లాంటిదేనని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమికి తాము మద్దతు ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఓ జర్నలిస్టు స్నేహతుడితో తన వాట్సప్‌లో జరిగిన వ్యక్తిగత సంభాషణను పార్టీ అధికారిక అభిప్రాయంగా ప్రచారం చేయడం సరికాదని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని పార్టీ భావిస్తోందని ఆమె తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచి, దానిని ఎలా అమలు చేస్తారో అధికారికంగా వెల్లడిస్తే, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు మద్దతు ఇచ్చే విషయాన్ని తమ పార్టీ పరిశీలిస్తుందని చెప్పారు. బిల్లును చూడకుండానే స్పందించడం సరికాదని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

