ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే, మహారాష్ట్ర మాజీ మంత్రి జితేంద్ర అవ్హాద్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. గడిచిన 72 గంటల వ్యవధిలో పోలీసులు తనపై రెండు తప్పుడు కేసులు నమోదు చేశారని అవ్హాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
మరాఠీ చిత్రం హర్హర్ మహదేవ్లో ఛత్రపతి శివాజీ మహరాజ్ చరిత్రను వక్రీకరించారంటూ గత శుక్రవారం ఆయన ఆ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. దాంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి బెయిల్పై విడిచిపెట్టారు. ఇవాళ మహిళపై దాడి చేశాడంటూ మరో కేసు నమోదు చేశారు. ఆదివారం ముంబ్రాలో బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనను గట్టిగా నెట్టేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
దాంతో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం థానే కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పిటిషన్పై థానే కోర్టు మంగళవారం విచారణ జరపనుంది.