జనాభా నియంత్రణ తప్పనిసరి: శరద్ పవార్

ముంబై: జనాభాను నియంత్రించడానికి ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కొత్త జనాభా విధానాన్ని ప్రకటించిన రోజే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కూడా దీనికి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉండాలంటే, ఆరోగ్య జీవన ప్రమాణాలు పాటించాలంటే, సమతుల పర్యావరణం కావాలంటే జనాభా నియంత్రణ తప్పనిసరి అని పవార్ స్పష్టం చేశారు.
వీటి కోసం జనాభా నియంత్రణ అనే సందేశం దేశంలోని ప్రతి మూలకూ చేరాలని ఆయన అన్నారు. ఆ దిశగా ప్రతి పౌరుడూ నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న జనాభా అభివృద్ధికి ఆటంకం అంటూ యూపీలో జనాభా నియంత్రణ కోసం నడుం బిగించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. ఇద్దరే ముద్దు, ఆ ఇద్దరి మధ్య కూడా ఎడం ఎక్కువగా ఉండాలని యోగి సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

