Nayab Singh Saini: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ
Nayab Singh Saini: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కురుక్షేత్రకు చెందిన ఎంపీ సైనీ.. ఆ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చీఫ్గా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎంగా సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
చండీఘడ్: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ(Nayab Singh Saini) బాధ్యతలు తీసుకోనున్నారు. బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఇవాళ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం క్యాబినెట్ రాజీనామా చేసింది. కురుక్షేత్రకు చెందిన ఎంపీ సైనీ.. ఆ రాష్ట్రానికి బీజేపీ పార్టీ చీఫ్గా ఉన్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎంగా సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శాసనసభాపక్ష నేతగా నయాబ్ సింగ్ సైనీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుభాష్ సుధా తెలిపారు. సైనీ పేరును ప్రతిపాదించగా, ఆ మీటింగ్ నుంచి అనిల్ విజ్ వెళ్లిపోయారు. కొత్త క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కడం అనుమానంగానే ఉన్నది.
లోక్సభ ఎన్నికల కోసం జరిగిన సీట్ల పంపకం విషయంలో బీజేపీ, జననాయక్ జనతా పార్టీ మధ్య చీలకలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాని వల్లే మనోహర్ లాల్ ఖట్టర్ .. సీఎం పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

