సముద్ర సేతు 2 మిషన్.. 9 యుద్ధ నౌకల ద్వారా ఆక్సిజన్

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్, ఔషధాలకు బాగా కొరత ఏర్పడింది. దీంతో కరోనా రోగులు ఆసుపత్రులలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు, అత్యవసర మందుల రవాణాకు భారత నౌకాదళం ఇటీవల ప్రారంభించిన సముద్ర సేతు 2 మిషన్‌ను తీవ్రం చేసింది. మూడు నేవల్ కమాండ్ల నుంచి 9 యుద్ధ నౌకలను రంగంలోకి దింపింది.
ఐఎన్ఎస్ తల్వార్ నౌక బహ్రెయిన్ నుంచి 27 టన్నుల చొప్పున రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను కర్ణాటకలోకి మంగళూరు పోర్టుకు బుధవారం తీసుకువచ్చినట్లు నేవీ తెలిపింది. ఐఎన్ఎస్ కోల్‌కతా 27 టన్నుల చొప్పున రెండు ఆక్సిజన్ ట్యాంకర్లు, 400 ఆక్సిజన్ సిలిండర్లు, 47 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో కువైట్ నుంచి బువారం భారత్‌కు ప్రయాణమైనట్లు వెల్లడించింది. 27 టన్నులున్న ఆక్సిజన్ ట్యాంకర్లు, 1500కుపైగా ఆక్సిజన్ సిలిండర్లను ఖతార్, కువైట్ నుంచి రవాణా చేసేందుకు మరో నాలుగు యుద్ధ నౌకలు బయలుదేరాయని పేర్కొంది.

మరోవైపు ఐఎన్ఎస్ ఐరావత్ నౌక 216 టన్నుల ఆక్సిజన్ ట్యాంకర్లు, 3,600 ఆక్సిజన్ సిలిండర్లు, 10,000 యాంటీజెన్ టెస్టింగ్ కిట్లు, ఏడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో సింగపూర్ నుంచి బుధవారం భారత్‌కు బయలు దేరిందని భారత నౌకాదళం తెలిపింది. అత్యవసర వైద్య సామాగ్రి తరలింపునకు ఐఎన్ఎస్ జలాశ్వను కూడా ఈ ప్రాంత సముద్ర జలాల్లో మోహరించినట్లు వెల్లడించింది. దక్షిణ నావల్ కమాండ్‌కు చెందిన ఐఎన్ఎస్ శార్దుల్, లిక్విడ్ ఆక్సిజన్ క్రయోజెనిక్ కంటైనర్లను తీసుకొచ్చేందుకు పర్షియన్ గల్ఫ్‌కు మార్గమధ్యలో ఉన్నదని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

